రూ. 10 లక్షలు కాదు రూ. 10 కోట్లు
చెన్నై: వరద బాధితులను ఆదుకునేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రూ. 10 కోట్లు ప్రకటించారు. అంతకుముందు ఆయన రూ. 10 లక్షలు ప్రకటించారు. ఆయనకంటే చిన్న హీరోలు సైతం ఎక్కువ మొత్తంలో సహాయం ప్రకటించడంతో రజనీకాంత్ విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో పెద్ద మొత్తంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అంతకుముందు ప్రకటించిన దానికంటే వంద రెట్లు ఎక్కువ ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసి రూ. 10 కోట్ల చెక్కు అందజేశారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా అందించారు.
కాగా, వరదల కారణంగా జన్మదిన వేడుకలకు దూరంగా రజనీకాంత్ నిర్ణయించుకున్నారు. రోబో 2 సినిమా షూటింగ్ ప్రారంభోత్సవాన్ని కూడా వాయిదా వేశారు. హీరో విజయ్ రూ. 5కోట్లు, సూర్య-కార్తీ రూ. 25 లక్షలు, అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, విశాల్ రూ. 10 లక్షలు, ధనుష్ రూ. 5లక్షలు సహాయం ప్రకటించారు.