
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు లోక్‌సభ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మహారాష్ట్రలో బాంద్రా- గోండ్యా, పాల్గర్ లోక్‌సభ స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లోని ఖైరానా, నాగాలాండ్ లోక్‌సభ స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలోని 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు షెడ్యూలు జారీ చేశారు. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు మే నెల 28న పోలింగ్ నిర్వహించనుండగా, మే 31న ఓట్ల లెక్కింపు జరగనుంది.