
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి తిరుగులేదని మరోసారి తేలింది. రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ సీట్లకు తాజాగా ఉప ఎన్నికలు జరిగాయి.
ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది. మనిక్‌టల, బాగ్డా, రానాఘాట్ దక్షిణ్, రాయిగంజ్ అసెంబ్లీ సీట్లకు జులై 10న ఉప ఎన్నిక జరిగింది. వీటి ఫలితాలు శనివారం(జులై 13) ఉదయం నుంచి వెలువడుతున్నాయి.
ఉప ఎన్నికల పోలింగ్‌లో అధికార టీఎంసీ అక్రమాలకు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలకు టీఎంసీ కొట్టిపారేసింది. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఎంసీ అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment