సందేశ్‌ఖాలీ వ్యవహారంపై సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సందేశ్‌ఖాలీలో జరిగిన ఘటన అత్యంత సిగ్గుచేటని పేర్కొంది.
ఈ మేరకు సందేశ్‌ఖాలీ హింసపై దాఖలైన పిటిషన్లను గురువారం విచారణ చేపట్టింది. సందేశ్‌ఖాళీ భూఆక్రమణ, లైంగిక ఆరోపణలపై దర్యాప్తు జరపాలంటూ దాఖలైన అఫిడవిట్‌లో పేర్కొన్న ఒక్క విషయం నిజమైనా, అందులో ఒక శాతం వాస్తవమున్నా అది సిగ్గుచేటని పేర్కొంది. రాష్ట్రంలో పౌరుల భద్రతకు ముప్పు కలిగితే 100 శాతం ప్రభుత్వ బాధ్యతేనని తెలిపింది. దీనికి అధికార పార్టీ, స్థానిక యంత్రాంగం అందుకు పూర్తి నైతిక బాధ్యత వహించాలని చీఫ్ జస్టిస్ టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
అంతేగాక ఈ కేసులో నిందితుడైన షేక్ షాజహాన్ తరపున హాజరైన న్యాయవాదిపై సైతం చీఫ్ జస్టిస్ మండిపడ్డారు. ‘విచారణలో ఉన్న నిందితుడి తరుపున హాజరువుతున్నారు. ముందు మీరు మీ చుట్టూ అలుముకున్న చీకటిని తొలగించండి. తరువాత మీ వాయిన్‌ను వినిపించడండి.’ అని మందలించారు.
కాగా జనవరి 5న ఈడీ అధికారులపై దాడికి సంబంధించిన కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు షాజహాన్ షేక్ కొంతకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 55 రోజుల పాటు షాజహాన్ పరారీలో ఉండడంపై కోర్టు అసహనం వ్యక్తంచేసింది. కాగా ఫిబ్రవరి నెలలో పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆలస్యంగా అరెస్ఠ్ చేయడంపై బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. స్థానిక టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతడి అనుచరులు అక్కడి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కవాకుండా వారి భూములను బలవంతంగా లాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన అధికార టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ వివాదానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి.
చదవండి: ఎన్నికల వేళ.. వంద కోట్ల ఇల్లీగల్ లిక్కర్ పట్టివేత?
Comments
Please login to add a commentAdd a comment