సాక్షి, హైదరాబాద్: కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ సముద్రపు నీళ్లు తప్ప మంచినీళ్లు లేవంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి దుష్పరిపాలనే అందుకు కారణమని సోమవారం ఆయన ఆరోపించారు. కృష్ణా ఆయకట్టు, పోలవరం నీళ్లు. జలయజ్ఞం గురించి వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడటాన్ని రైతులు ఏవగించుకుంటున్నారన్నారు.
ఈ మేరకు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు రాసిన ఐదు పేజీల బహిరంగ లేఖను ఆయన విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర, ఆయన మాతృమూర్తి, సోదరి షర్మిల యాత్ర అన్నీ అధికారం కోసమేనని, సమైక్యాంధ్ర శంఖారావం కూడా అందుకోసమేనని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వల్ల పలు సమస్యలొస్తాయంటూ తొలుత స్పందించింది చంద్రబాబేనాన్నరు. 2014 ఎన్నికలయ్యాక కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తామని జగన్, విజయమ్మ ఎన్నోసార్లు చెప్పారని, 2011 నవంబరు 11న హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జగన్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారని అన్నారు.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
గాలి విలేకరుల సమాశానికి ‘సాక్షి’ ప్రతినిధిని అనుమతించలేదు. అనుమతించి ఉంటే ఆయనకు ‘సాక్షి’ ఈ కింది ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేది...
రాష్ట్రం విడిపోతే మహారాష్ట్ర, కర్నాటక నుంచి కృష్ణా జలాల రాక గగనమవుతుందన్న వైఎస్సార్‌సీపీ వాదనను మీరు ఆక్షేపిస్తున్నారు. అంటే రాష్ట్రం విడిపోయినా సీమాంధ్రలో నీటికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని మీ అభిప్రాయమా?
బాబు సీఎంగా ఉండగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టించుకోకపోవటాన్ని విస్మరించారా?
ఆల్మట్టి ప్రాజెక్టును కర్ణాటక పూర్తి చేసింది బాబు హయాంలోనే కదా! దాని నిర్మాణం పూర్తవుతుందని, తత్ఫలితంగా రాష్ట్రంలో కృష్ణా పరివాహక ప్రాంతం ఎడారవుతుందని అప్పుడే హెచ్చ
రించినా బాబు పట్టించుకోకపోవడం నిజం కాదా?
తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ, యూపీఏ సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకున్నాక మొదట స్పందించింది చంద్రబాబేనని మీరు చెబుతున్నారు కదా. కానీ సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటుకు నాలుగైదు లక్షల కోట్లు ఖర్చవుతాయని, వాటిని కే
ంద్రమే భరించాలని మొదట బాబు డిమాండ్ చేయడం నిజం కాదా?
2014 ఎన్నికల తరవాత కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలన్నది అప్పటి అవసరాలను బట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఉంటుందని విజయమ్మ, జగన్ చెప్పారు. అయితే కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో బాబు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారని అదే హిందుస్థాన్ టైమ్స్ ప్రచురించింది. పైగా రాష్ట్రాన్ని విభజిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు మీకు ముందుగానే చెప్పినట్టు కూడా అందులో స్పష్టం చేసింది. దీనిపై మీరేమంటారు?
వైఎస్సార్‌సీపీ ‘సమైక్య శంఖారావం’ను నాటకమంటున్న మీరు, చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని ఎందుకు చెప్పడం లేదు? అలా చెప్పనప్పుడు సీమాంధ్రలో బాబు చేస్తున్న బస్సు యాత్ర దేనికోసం?
వైఎస్సార్‌సీపీది మొసలి కన్నీరు
Published Tue, Sep 3 2013 4:51 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement