రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని, ప్రత్యేక హోదా గూర్చి మాట్లాడే అర్హత ఆ పార్టీ నాయకులకు లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు
రాజమండ్రి సిటీ : రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని, ప్రత్యేక హోదా గూర్చి మాట్లాడే అర్హత ఆ పార్టీ నాయకులకు లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీ హర్షకుమార్‌లు పదవుల కోసం పాకులాడి చివరకు రాష్ట్రాన్ని నాశనం చేసిన తరువాత బయటకు వచ్చేశారని విమర్శించారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన టీడీపీ నగర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల ఓట్లు పొందిన కాంగ్రెస్ కోటి సంతకాల కార్యక్రమం కోసం బయలుదేరడ ం హాస్యాస్పదంగా ఉందన్నారు. విభజన బిల్లు సమయంలో సరైన విలువలు పాటించకుండా, ప్రత్యేక హోదాను బిల్లులో నమోదు చేయకుండా మాటవరసకు మాత్రమే ప్రకటించి తెల ంగాణ ప్రకటించేశారన్నారు. విభజన సమయంలో టీడీపీ సమన్యాయం కోసం పోరాడిందన్నారు. రాజధాని నిర్మాణం, నీరు, విద్య, వైద్యం, విద్యుత్ వంటి అంశాల అభివృద్ధి రూ.5 లక్షల కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబు మొదటి నుంచీ చెబుతున్నారన్నారు. ఆయన వెంట మేయర్ పంతం ర జనీ శేషసాయి, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు ఉన్నారు.