వడమాలపేట : జిల్లాలో నగరి నియోజకవర్గం అభివృద్ధిలో నంబర్ వన్ అని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, అభివృద్ధి పనుల్లో కాదు అక్రమాల్లో నంబర్ వన్ అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. శనివారం ఆమె వడమాలపేటలో విలేకరులతో మాట్లాడారు. నగరి నియోజకవర్గంలో సీఎం సహాయనిధి నుంచి ఏడు వందల మందికి ఆర్థికసాయం ఇప్పించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని, అందులో సగం మంది కూడా అర్హులు లేరని విమర్శించారు.
దీనిపై తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని, నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? అంటూ సవాలు విసిరారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రతి పంచాయతీకి వెళదామని, 35 ఏళ్లుగా ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో... మూడేళ్లలో తాను చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలే చెబుతా రని తెలిపారు. తాము ప్రతిపాదనలు పంపితే మం జూరైన రోడ్లను అధికారులను బెదిరించి రద్దు చేయిస్తున్నారని, ఇదేనా అభివృద్ధి అని ప్రశ్నించారు. మూడేళ్లుగా ఒక్కఇల్లు కూడా మంజూరు చేయలేదన్నారు.
చంద్రబాబునాయుడు తనకు రాజకీయ భిక్షపెట్టారని ఎమ్మెల్సీ చెబుతున్నారని, అంతకు పదింతలు పార్టీ కోసం తాను కష్టపడ్డానని తెలిపారు. ఆయనకు రాజకీయ భిక్షపెట్టిన రామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే కాపాడారా? అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి చంద్రబాబును బూతులు తిట్టారని, అక్కడ మంత్రి పదవి ఇవ్వలేదని తిరిగి చంద్రబాబు పంచన చేరి ఆయన దేవుడంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తికి తనను విమర్శించే అర్హత లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment