
'హైదరాబాద్ చంద్రబాబు అబ్బ సొత్తే'
హైదరాబాద్ సిటీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అబ్బ సొత్తేనని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఏ అభివృద్ధి జరిగినా అది టీడీపీ హయాంలోనే జరిగిందని అన్నారు. టీఆర్‌ఎస్ కానీ, ఇతర పార్టీలు కానీ హైదరాబాద్‌కు చేసిందేమీ లేదని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. హైదరాబాద్ పై తెలంగాణ నేతలకు ఎంత అధికారం ఉందో, అంతకన్నా ఎక్కువ అధికారం తమకూ ఉందని గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు.