సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ శాసనసభ్యత్వాలకు తాము చేసిన రాజీనామాలు ఉత్తుత్తివి కాదని టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే లేఖలు ఇచ్చామని చెప్పారు. బుధవారం టీ డీఎల్పీలో గాలి విలేకరులతో మాట్లాడారు. తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు రాసిన లేఖను ప్రదర్శించారు. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ స్పీక ర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు చేశారన్నారు. తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు వస్తున్న వార్తలపై పార్టీ అధ్యక్షుడు స్పందిస్తారన్నారు.
ఈ విలేకరుల సమావేశానికి సాక్షి ప్రతినిధిని అనుమతించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్త ఇస్తున్నాం. ఒకవేళ అనుమతించి ఉంటే గాలికి ఈ క్రింది ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేది.
1. మీరు, మీ పార్టీ ఎంపీలు నిబంధనల మేరకే రాజీనామాలు సమర్పిస్తే ఒక్క హరికృష్ణ రాజీనామా మా త్రమే ఎందుకు ఆమోదం పొందింది. మిగతా ఎంపీల రాజీనామాలు ఎందుకు ఆమోదం పొందలేదు? అంటే ఒక్క హరికృష్ణ మాత్రమే నిబంధనల మేరకు రాజీనామా చేసినట్టు కదా?
2. మీ పార్టీ ఎంపీలు రాజీనామాలు ఆమోదం పొందని విధంగా షరతులతో కూడిన లేఖలు ఇచ్చారని హరికృష్ణ చెప్పిన విషయంపై మీరేమంటారు?
3. మీలో కొందరు రాజీనామా చేశామని చెబుతున్నారు. మరి మీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాజీనామా చేయరా? చేయమని మీ పార్టీ నేతలెవరూ కోరడం లేదా?
మావి ఉత్తుత్తి రాజీనామాలు కాదు: గాలి
Published Thu, Sep 5 2013 4:39 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
Advertisement
Advertisement