సామినేని ఉదయభాను
విజయవాడ : అమరావతి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రజలను, ఎన్నారైలను అప్పు అడుగుతున్నారని, బాబును నమ్మిఆయనకు అప్పు ఇస్తే విజయమాల్యాకు, అగ్రీగోల్డ్‌కు, కేశవరెడ్డిలకు ఇచ్చినట్లేనని వైఎస్ఆర్‌సీపీ విజయవాడ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు పెట్టకుండా పార్లమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్తే... వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు వెంటనే రాజీనామాలు చేసి, ఢిల్లీలో అమరణదీక్షలకు దిగితారని మా అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. వారికి మద్దతుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు నిరాహారదీక్షలు ప్రారంభిస్తారు. హోదాకోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారు మరి మీ ఎంపీలకు మీరు ఏ ఆదేశాలు ఇస్తున్నారు? అని చంద్రబాబును ప్రశ్నించారు.
అమరావతి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రజల నుంచి రుణాలను కోరుతున్నారు, ఎన్నారై లను కూడా అప్పులు అడుగుతున్నారు. కానీ ఎఫ్ఆర్‌బీఎం ప్రకారం ఇది చట్ట వ్యతిరేకం. ఇది ఆచరణ సాధ్యం కాదని ఎపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వంటి అధికారులే చెబుతున్నారు అన్నారు. గత 60 ఏళ్ళ కాలంలో పదమూడు జిల్లాలకు గాను పాత ప్రభుత్వాలురూ. 96 వేల కోట్లు అప్పు తీసుకున్నాయి. కానీ చంద్రబాబు ఈ నాలుగేళ్ళ పాలనలో చేసిన అప్పు రూ. 1.20 లక్షల కోట్లు. తాత్కాలిక రాజధాని పేరుతో పెద్ద ఎత్తున ప్రైవేటు సంస్థలకు నిధులు కట్టబెట్టి, ఎంతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మాత్రమే చిత్తశుద్ధి తో పోరాటం చేస్తున్నారన్నారు. ఢిల్లీకి వెడుతున్న చంద్రబాబుకు అసలు ఎందుకు వెళ్తున్నాడో క్లారిటీ లేదని,ఏం చేయడానికి మీరు ఢిల్లీకి వెడుతున్నారు మీ ఉద్యమ కార్యాచరణ ఏమిటి బాబూ? అంటూ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment