సాక్షి, విజయవాడ : లోక్‌సభలో జరిగిన అవిశ్వాసం చర్చపై వైఎస్సార్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ఒక్క పార్టీ కూడా మాట్లాడలేదని వెల్లంపల్లి ధ్వజమెత్తారు. అంతేకాక సీఎం చంద్రబాబు తీరును కూడా ఆయన దుయ్యబట్టారు. తనకు 40ఏళ్ల అనుభవం ఉందని చంద్రబాబు చెప్పుకోవడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు ఆ అనుభవం ఇప్పుడు ఏమైందని వెల్లంపల్లి ప్రశ్నించారు.
పార్లమెంట్ సమావేశాల్లో ఏ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై మాట్లాడలేదని వైఎస్సార్‌సీపీ నేత పేర్కొన్నారు. హోదాను వదిలేసి చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకున్నారని పార్లమెంట్‌లో స్వయనా ప్రధాని మోదీనే చెప్పారు. అయినా టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకుండా డ్రామాలాడుతున్నారని వెల్లంపల్లి విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీనే పోరాడుతుందన్నారు. ఏపీ బంద్‌కు అన్ని పార్టీలు సహకరించాలని వైఎస్సార్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment