రాజీవ్ పేరును ఎలా కొనసాగించమంటున్నారు?
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అవినీతిపరుడని గతంలో కేసీఆర్ విమర్శించారని టీడీపీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు గుర్తుచేశారు. ఇప్పుడు శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరును ఎలా కొనసాగించమంటున్నారని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ కు రాజకీయభిక్ష పెట్టిన ఎన్టీఆర్ ను అవమానపరిచేలా తెలంగాణ శాసనసభలో తీర్మానం చేయడం తగదని ఆయన హితవు పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ రాష్ట్ర శాసనసభ శుక్రవారం తీర్మానించిన నేపథ్యంలో ముద్దుకృష్ణమ నాయుడు స్పందించారు.