ఇది రాజకీయ వ్యభిచారమే : గాలి
పుత్తూరు (చిత్తూరు): తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చి రాజకీయ వ్యభిచారం చేస్తున్నది కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. సోమవారం చిత్తూరు జిల్లా పుత్తూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్‌కు ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే, సిగ్గు ఎగ్గు లేకుండా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి, నీతి నిజాయితీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
కేసీఆర్ చేసిన అప్రజాస్వామ్యక పనులకు అండమాన్ జైలే గతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో రైతు, డ్వాక్రా రుణమాఫీ అమలు చేస్తుంటే పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఓర్వలేక ప్రభుత్వాన్ని విమర్శించడం శోచ నీయమన్నారు. సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసుల సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనన్నారు.