
'ముద్దుకృష్ణమా... మీరే మా గవర్నర్'
హైదరాబాద్ : టీడీఎల్పీ ఉపనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు నిన్న శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతుండగా...అదే సమయంలో ఇన్నర్ లాబీల్లో నుంచి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు... ఆయన్ను చూసి 'సార్ ...రాష్ట్రం విడిపోతుందని ఏమీ బాధపడకండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే మిమ్మల్ని గవర్నర్గా నియమించుకుంటాం. హిజ్ ఎక్స్లెన్సీ అని గౌరవంగా పిలుచుకుంటాం' అని పేర్కొన్నారు.
దీంతో అక్కడే ఉన్న విలేకర్లు స్పందిస్తూ ...'మరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంగతి ఏమిటి' అని ప్రశ్నించారు. అయితే ఇద్దరికి చెరో రెండున్నర సంవత్సరాలు అవకాశం కల్పిస్తామని హరీశ్ బదులిచ్చారు. అప్పుడే అక్కడకు వచ్చిన రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ...'మీమ మామ (కేసీఆర్)కు సన్నిహితులైన వారికేనా గవర్నర్ గిరీ ఇప్పించేది మిగిలిన వారి సంగతి ఏమిటి' అని అనడంతో హరీశ్ అక్కడ నుంచి నవ్వుతూ నిష్క్రమించారు.