
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికార ప్రతినిధిగా గవర్నర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. గవర్నర్ తీరు కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఓ డాక్టర్‌గా గవర్నర్ తమిళిసై వైద్యశాఖ కష్టాన్ని గుర్తించడం లేదని మండిపడ్డారు. గవర్నర్ తీరులో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఉస్మానియాపై గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. ఆసుపత్రికి భవనం పనికిరాదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వం అభిప్రాయం తెలిపిందని, విషయం కోర్టు పరిధిలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రబుత్వం చేస్తున్న మంచి పనులు గవర్నర్‌కు కనించడం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు.
చదవండి: తెలంగాణ ఠీవీ.. మన పీవీ: సీఎం కేసీఆర్