నగరి, న్యూస్‌లైన్:
కుట్ర రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే ముద్దుకృష్ణమ నాయుడికి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యురాలు రోజా హితవు పలికారు. నగరిలో ఏర్పాటు చేసిన మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఆమె ఆదివారం నివాళులర్పించారు. రోజా మాట్లాడుతూ మహానేతపై ఉన్న అభిమానంతో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక బస్టాండు ప్రాంగణంలో వైఎస్‌ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. ఎవరికీ పోటీగా విగ్రహ స్థాపన చేయలేదన్నా రు.
గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే తాము బోరు వేసి నీటి సౌకర్యం కల్పిస్తే పోటీగా కొన్ని పార్టీలకు చెందినవారు బోరు వేశారన్నారు. ప్రస్తుతం తాము విగ్రహాన్ని ప్రతిష్టిస్తే పోటీగా వారు విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ముద్దుకృష్ణమ నాయుడు తన 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌తో కలిసి తిరుగు తూ చంద్రబాబు నాయుడును, టీడీపీని ఆయన విమర్శించలేదా అన్నారు. నేడు వైఎస్‌ఆర్ విగ్రహం పెట్టిన తర్వాత ఎన్‌టీఆర్ విగ్రహం పెట్టించాలని ఆయనకు ఆలోచన రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి కుట్ర రాజకీయాలను మానుకోవాలని ఆమె హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కేజేకుమార్, పార్టీ రూరల్ మండల కన్వీనర్ భాస్కర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కేజేసురేష్, మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రహమాన్, స్థానిక నాయకులు బీఆర్వీ అయ్యప్పన్, రామ్మూర్తి, తిరుమలరెడ్డి, శరత్‌బాబు, జవహర్ రెడ్డి, బిలాల్, చంద్ర, సుబ్రమణ్యం, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
కొలిక్కి వచ్చిన విగ్రహాల వివాదం
నగరి పట్టణంలో విగ్రహాల ఏర్పాటు వివాదం ఆదివారం సాయంత్రం కొలిక్కి వచ్చింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నాయకులతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శేఖర్, ట్రైనింగ్ డీఎస్పీ చంద్ర, సీఐ జగన్‌మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు, ఎంపీడీవో సీతమ్మ చర్చించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా విగ్రహాలను బస్టాండ్ ప్రాంగణంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకోవడానికి నాయకులు అంగీకరించారు. ఈ మేరకు అనువైన స్థలాలను ఇరు పార్టీల వారికి బస్టాండు ప్రాంగణంలో కేటాయించారు.
కుట్ర రాజకీయాలు మానుకోండి
Published Mon, Jan 20 2014 2:51 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement