టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఇంటి ముందు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధర్నా చేశారు.
తిరుపతి: టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఇంటి ముందు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధర్నా చేశారు. ముద్దుకృష్ణమ నాయుడు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ ఆయన ఆందోళనకు దిగారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.
ముద్దుకృష్ణమ నాయుడు తీరుగా వ్యతిరేకంగా చెవిరెడ్డి మద్దతుదారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ముద్దుకృష్ణమ నాయుడు నివాసం ఎదుట పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.