పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం | Chandra babu Naidu Meet With Party Leaders | Sakshi
Sakshi News home page

పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం

Published Tue, Nov 12 2013 10:38 AM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM

పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం - Sakshi

పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో జీవోఎం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి వెళ్లరాదని పార్టీ నిర్ణయించింది. ఈ  సందర్భంగా పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశానికి వెళ్లరాదని టీడీపీ నిర్ణయం తీసుకుందన్నారు.

రెండు ప్రాంతాలకు చెందిన ప్రతినిధులను పిలిచి మాట్లాడాలన్నదే తమ డిమాండ్ అన్నారు. దీనిపై లేఖ ఎవరికి రాయాలనే అంశంపై సాయంత్రం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు ముద్దుకృష్ణమ నాయుడు తెలిపారు. జీవోఎం రాష్ట్రం అంతా తిరిగి అభిప్రాయాలు సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement