'చంద్రబాబు ఎందుకు దీక్ష చేశారో ఆయనకే తెలియదు' | Anantapur MP Antha Venkatarami Reddy fire on Telugu Desam Party president Chandra babu naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ఎందుకు దీక్ష చేశారో ఆయనకే తెలియదు'

Published Tue, Oct 15 2013 11:11 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

'చంద్రబాబు ఎందుకు దీక్ష చేశారో ఆయనకే తెలియదు' - Sakshi

'చంద్రబాబు ఎందుకు దీక్ష చేశారో ఆయనకే తెలియదు'

దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షపై ఆయనకే స్పష్టత లేదని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన అనంతపురంలో మాట్లాడుతూ... న్యూఢిల్లీలో ఆయన ఐదురోజుల దీక్ష ఎందుకు చేశారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. విభజనపై వైఖరిని స్పష్టం చేయాలని ఆయన  చంద్రబాబును డిమాండ్ చేశారు. విభజనపై మంత్రుల బృందం ( జీవోఎం) ఏర్పాటు తనకు బాధ కలిగించిందని అనంత ఆవేదన వ్యక్తం చేశారు.

 

అసెంబ్లీ తీర్మానంపై కేంద్రమంత్రుల్లో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. తాను మాత్రం స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కన్నా సీమాంధ్ర ప్రజల మనోభావాలే తనకు ముఖ్యమన్నారు. హైదరాబాద్, నీటి సమస్యలపై పరిష్కారం చూపకుండా విభజన చేయాలనుకోవడం దారుణమని ఎంపీ అనంత వ్యాఖ్యానించారు. విభజన ప్రకటన కేంద్రం వెనక్కి తీసుకుంటే తాను చేసిన రాజీనామాపై పునరాలోచించుకుంటానని అనంత వెంకట్రామిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement