Antha Venkatarami Reddy
-
‘శ్రీనివాసరావ్‌ని చంపి కేసు క్లోజ్ చేసేందుకు కుట్ర’
సాక్షి, అనంతపురం : శ్రీనివాసరావును చంపి కేసు క్లోజ్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంపేందుకు భారీ కుట్ర జరిగిందన్నారు. ప్రభుత్వ పెద్దల సహకారంతోనే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తులు వెళ్లాయని ఆరోపించారు. శ్రీనివాసరావును చంపి కేసు క్లోజ్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పోలీసు కస్టడిలోని నిందితుడికే రక్షణ లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆపరేషన్ గరుడ నిజమనడం సిగ్గు చేటని వెంకట్రామి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతుంటే నటుడు శివాజీని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీలో ఆపరేషన్ చంద్రబాబు కొనసాగుతుందంటూ విమర్శించారు. సీఎం, డీజీపీ డైరెక్షన్లోనే నిందుతుడు మాట్లాడుతన్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే థర్డ్ పార్టీ దర్యాప్తుకు అంగీకరిస్తూ లేఖ రాయలని.. కేసును సుప్రీం కోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
రాష్ట్రానికి అన్యాయం చేసిన టీడీపీ- బీజేపీలకు బుద్ధి చెప్పాలి
-
అనంతలో వైఎస్ఆర్సీపీ వంచనపై గర్జన
-
చంద్రబాబుపై అనంత ఫైర్
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుపై అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి శుక్రవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు పార్లమెంట్ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. పంట బీమా నగదు పాత అప్పులకు జమ చేయకూడదని 2005లో పార్లమెంట్ చట్టం చేసిందని గుర్తు చేశారు. ఆ చట్టానికి విరుద్ధంగా పంటల బీమా సొమ్మును రుణమాఫీ కింద జమ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నిర్వాకం వల్ల ఒక్క అనంతపురం జిల్లా రైతులే రూ. 226 కోట్ల బీమా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు విధానాల వల్ల మేలు కంటే కీడే అధికంగా జరగుతుందని చెప్పారు. రైతులకు కొత్త రుణాలు రాలేదు.... అలాగే ఇన్పుట్ సబ్సిడీ అందలేదని అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు
ఆయనో అబద్ధాల వీరుడు నమ్మి గెలిపిస్తే రాష్ర్టం మరింత సంక్షోభం కరెంటు బిల్లులు చెల్లించలేదని రైతులపై కేసులు పెట్టించారు రోడ్‌షోలో అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజం కళ్యాణదుర్గం రూరల్, న్యూస్‌లైన్ : తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. ‘జన పథం’ పేరిట వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం కళ్యాణదుర్గంలోని టీ సర్కిల్లో నిర్వహించిన రోడ్‌షోలో ఎంపీ మాట్లాడారు. రాష్ర్ట విభజనకు టీడీపీ అధినేత పూర్తిగా సహకరించారని విరుచుకుపడ్డారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ అనేక పోరాటాలు చేసిందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న రైతులపై కేసులు బనాయించారన్నారు. చివరికి మహిళలు మంగళసూత్రాలను తాకట్టుపెట్టి బకాయిలు చెల్లించాల్సి వచ్చిందన్నారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం నష్ట పరిహారం కూడా ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు అడుగడుగునా ప్రజలను మోసం చేశారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రకటిస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేశారన్నాన్నారు. అయితే 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైలుపై చేసి.. ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారని కొనియాడారు. టీడీపీ పాలనలో శాశ్వత అభివృద్ధి పనులు ఎక్కడా జరగలేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు నాలుగు సార్లు భూమి పూజ చేసి గాలికి వదిలేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. వైఎస్ అధికారంలోకి రాగానే రాష్ర్టంలో ఊహించలేని అభివృద్ధి జరిగిందన్నారు. చంద్రబాబు అబద్ధాల వీరుడు, అధికారం కోసం ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఆయన మాటలను నమ్మి అధికారం కనుక కట్టబెడితే రాష్ర్టం మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని హెచ్చరించారు. రాజకీయ నేతలకు అధికారం ముఖ్యం కాదు... ప్రజల సంక్షేమానికి పాటు పడాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతున్న వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రాబోవు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ై వెఎస్సార్సీపీ అధికారంలోకి రావాడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సీఈసీ సభ్యుడు ఎల్ఎం మోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీని నమ్మితే ప్రజల భవిష్యత్తు అంధకారమేనన్నారు. వైఎస్ ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్తా సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ-కాంగ్రెస్‌ను తిప్పి కొట్టి వైఎస్సార్సీపీని గెలిపించాలన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త బి.తిప్పేస్వామి మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిచి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహుమానంగా ఇద్దామన్నారు. కళ్యాణదుర్గం ప్రాంతానికి వైఎస్ విజయమ్మ రావడం మహా అదృష్టమన్నారు. రోడ్‌షోలో సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు. -
'చంద్రబాబు ఎందుకు దీక్ష చేశారో ఆయనకే తెలియదు'
దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షపై ఆయనకే స్పష్టత లేదని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన అనంతపురంలో మాట్లాడుతూ... న్యూఢిల్లీలో ఆయన ఐదురోజుల దీక్ష ఎందుకు చేశారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. విభజనపై వైఖరిని స్పష్టం చేయాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. విభజనపై మంత్రుల బృందం ( జీవోఎం) ఏర్పాటు తనకు బాధ కలిగించిందని అనంత ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ తీర్మానంపై కేంద్రమంత్రుల్లో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. తాను మాత్రం స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కన్నా సీమాంధ్ర ప్రజల మనోభావాలే తనకు ముఖ్యమన్నారు. హైదరాబాద్, నీటి సమస్యలపై పరిష్కారం చూపకుండా విభజన చేయాలనుకోవడం దారుణమని ఎంపీ అనంత వ్యాఖ్యానించారు. విభజన ప్రకటన కేంద్రం వెనక్కి తీసుకుంటే తాను చేసిన రాజీనామాపై పునరాలోచించుకుంటానని అనంత వెంకట్రామిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు.