‘శ్రీనివాసరావ్‌ని చంపి కేసు క్లోజ్‌ చేసేందుకు కుట్ర’ | Anantha Venkatrami Reddy Fires On CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 31 2018 3:24 PM | Last Updated on Wed, Oct 31 2018 6:33 PM

Anantha Venkatrami Reddy Fires On CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, అనంతపురం : శ్రీనివాసరావును చంపి కేసు క్లోజ్‌ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని చంపేందుకు భారీ కుట్ర జరిగిందన్నారు. ప్రభుత్వ పెద్దల సహకారంతోనే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తులు వెళ్లాయని ఆరోపించారు. శ్రీనివాసరావును చంపి కేసు క్లోజ్‌ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పోలీసు కస్టడిలోని నిందితుడికే రక్షణ లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

13 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆపరేషన్‌ గరుడ నిజమనడం సిగ్గు చేటని వెంకట్రామి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతుంటే నటుడు శివాజీని ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీలో ఆపరేషన్‌ చంద్రబాబు కొనసాగుతుందంటూ విమర్శించారు. సీఎం, డీజీపీ డైరెక్షన్‌లోనే నిందుతుడు మాట్లాడుతన్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే థర్డ్‌ పార్టీ దర్యాప్తుకు అంగీకరిస్తూ లేఖ రాయలని.. కేసును సుప్రీం కోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement