
'కేసీఆర్ చెప్పదలచుకుంది జీవోఎంకు చెప్పొచ్చు'
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తాను చెప్పదలచుకున్నది ఏదైనా ఉంటే జీవోఎంకు చెప్పుకోవచ్చని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. అంతేకానీ అనవసర వ్యాఖ్యలు చేయరాదని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. అన్ని పార్టీలను సంప్రదించాకే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని దిగ్విజయ్ మరోసారి స్పష్టం చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా జీవోఎంకు నివేదిక ఇస్తుందన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ఉన్న అగాధాన్ని తగ్గించే బాధ్యత కాంగ్రెస్పై ఉందన్నారు. టీడీపీని లక్ష్యంగా చేసుకునే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందనటం సమంజసం కాదని దిగ్విజయ్ అన్నారు. గతంలో ఆంటోనీ కమిటీని పార్టీ కమిటీ అంటూ టీడీపీ గతంలో వ్యతిరేకించిందని ఆయన గుర్తు చేశారు.