
అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడి భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా వెంకట్రామపురానికి తరలించారు.
సాక్షి, చిత్తూరు: అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడి భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా వెంకట్రామపురానికి తరలించారు. భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.
ముద్దుకృష్ణమ నాయుడ్ని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ శ్రేణులు తరలివస్తున్నారు. గురువారం మధ్యాహ్నం వెంకట్రామపురంలో ముద్దుకృష్ణమ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.