కృష్ణా జిల్లా నందిగామలోని ఏఎంసీ కార్యాలయం ముందు ఎస్‌పీఎం కంపెనీ బాధిత రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలోని ఏఎంసీ కార్యాలయం ముందు ఎస్‌పీఎం కంపెనీ బాధిత రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. సుబాబు (కాగితం తయారీకి వాడే కర్రలు) బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ధర్నాకు దిగారు. వీరికి కంపెనీ వారు రూ.9 కోట్ల 50 లక్షలు బకాయిలు చెల్లించాలి.
మూడు రోజులుగా రైతులు చేస్తున్న ఈ ధర్నాకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మద్దతు పలికారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ప్రజలకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా లేవనెత్తుతామన్నారు.