
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లానందిగామ పరిధిలో మొట్ట మొదటి జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తమ పరిధిలోకి రానప్పటికీ బాధితులు ఫిర్యాదులు చేస్తే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.. మొదటిసారిగా బాలుడి మిస్సింగ్ కేసు సంబంధించి కంచికచర్ల పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కంచికచర్ల పీఎస్ పరిధి కాకపోయినా కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలతో బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మిర్యాలగూడ మండలం వీరంపాడులో బాలుడిని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.
(చదవండి: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం)