నందిగామలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు | TDP Leader Attacks on YSRCP Worker in Nandigama | Sakshi
Sakshi News home page

నందిగామలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు

Published Mon, Sep 30 2019 10:44 AM | Last Updated on Mon, Sep 30 2019 2:37 PM

TDP Leader Attacks on YSRCP Worker in Nandigama - Sakshi

సాక్షి, నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. భవన నిర్మాణం కార్మికుల సంఘం ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి కార్మికులతో కలిసి ర్యాలీగా వెళుతుండగా.. టీడీపీ నేత ఏచూరి రాము వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఇది తెలుగుదేశం పార్టీ విజయమని ఏచూరి రాము ప్రసంగించారు. అయితే ఇది తప్పు అని వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఖాజా ఏచూరి రాము ప్రసంగాన్ని ఖండించారు. అవమానంగా భావించిన టీడీపీ నేత రాము తన అనుచరులతో ఖాజాపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఖాజా కాలికి గాయాలలయ్యాయి. అతడ్ని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement