నందిగామలో ఆగంతకుల కాల్పులు | Unknown persons opened fire on Man in nandigama | Sakshi
Sakshi News home page

నందిగామలో ఆగంతకుల కాల్పులు

Published Tue, Oct 28 2014 10:56 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

Unknown persons opened fire on Man in nandigama

నందిగామ : కృష్ణాజిల్లా నందిగామలో మంగళవారం ఆగంతకుల కాల్పులు కలకలం రేపాయి. ట్రాక్టర్ షోరూమ్లో ఉన్న బొగ్గవరపు శ్రీశైల వాసు అనే వ్యక్తిపై గుర్తు తెలియని కొందరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీశైలవాసు అక్కడికక్కడే మృతి చెందాడు. 

 

శ్రీశైల వాసు గతంలో కాంగ్రెస్ జాతీయ ఉక్కు మండలి సభ్యునిగా  పని చేశారు. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.  కాగా కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ కాల్పులు జరిగాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. హంతకులు ఉపయోగించిన వాహనంపై వారు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement