srisailavasu
-
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే కాల్పులు
విజయవాడ : ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే శ్రీశైల వాసుపై కాల్పులు జరిగినట్లు కృష్ణాజిల్లా ఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ మృతుడు శ్రీశైల వాసు మేనల్లుడు గున్నం హనుమంతరావు తన స్నేహితుడు పాషా సాయంతో ఈ కాల్పులకు పాల్పడినట్లు వెల్లడించారు. శ్రీశైల వాసు తన మేనల్లుడికి రూ.కోటి బాకీ ఉన్నట్లు, ఈ నేపథ్యంలోనే వారి మధ్య గతంలో గొడవ జరిగినట్లు తమ వద్ద సమాచారం ఉందని ఎస్పీ తెలిపారు. నిందితులు పోలీసులకు లొంగిపోయారన్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. నిందితుల ఆచూకీ కోసం నల్గొండ జిల్లాతో పాటు కృష్ణా జిల్లా పోలీసులను కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపారు. నందిగామలో ఈరోజు ఉదయం జరిగిన కాల్పుల్లో శ్రీశైల వాసు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. -
నందిగామ కాల్పులు : మేనల్లుడే హంతకుడు!
-
నందిగామలో ఆగంతకుల కాల్పులు
-
నందిగామలో ఆగంతకుల కాల్పులు
నందిగామ : కృష్ణాజిల్లా నందిగామలో మంగళవారం ఆగంతకుల కాల్పులు కలకలం రేపాయి. ట్రాక్టర్ షోరూమ్‌లో ఉన్న బొగ్గవరపు శ్రీశైల వాసు అనే వ్యక్తిపై గుర్తు తెలియని కొందరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీశైలవాసు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీశైల వాసు గతంలో కాంగ్రెస్ జాతీయ ఉక్కు మండలి సభ్యునిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాగా కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ కాల్పులు జరిగాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. హంతకులు ఉపయోగించిన వాహనంపై వారు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించనున్నారు.