భోగాపురం మండలం గరి నందిగామ గ్రామంలో పండుగరోజు విషాదం అలముకుంది.
విజయనగరం: భోగాపురం మండలం గరి నందిగామ గ్రామంలో పండుగరోజు విషాదం అలముకుంది. గ్రామదేవత పండుగకు వచ్చిన నలుగురు యువకులు చంపావతి నదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఇటీవల నదిలో అక్రమ తవ్వకాలు ఎక్కువైపోయాయి. ఇసుక తవ్వకాల వల్ల నదిలో లోతు పెరిగి పోయింది. దానికి తోడు నదిలో నీరు ఎక్కువగా ఉంది. లోతు తెలియని యువకులు నదిలో దిగి గల్లంతయ్యారు. వారి కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు. గ్రామానికి రెండు మూడు కిలోమీటర్ల దూరం వరకు యువకులు కొట్టుకుపోయి ఉంటారేమోనని వెతుకుతున్నారు.
ఈ నలుగురు యువకులు విశాఖపట్నం నుంచి గ్రామదేవత పండుగ కోసం గ్రామానికి వచ్చారు. గ్రామం ఆనందంగా పండుగ చేసుకునే సమయంలో నలుగురు యువకులు గల్లంతవడంతో విషాదం నెలకొంది.
**