సాక్షి, ఎన్టీఆర్: ఎక్కడి నుంచైనా తాను పోటీకి సిద్ధమని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సీఎం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కేశినేని నాని నిజం తెలుసుకొని, సీఎం జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు వైఎస్సార్‌సీపీలో చేరారని తెలిపారు.
నందిగామలో జగనన్న వాకింగ్ ట్రాక్‌ను మంత్రి జోగి రమేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, తదితర నేతలు పాల్గొన్నారు. సుమారు రూ. కోటి రూపాయల వ్యయంతో 700 మీటర్ల వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేశినేని నానికి వైఎస్ జగన్‌పై అభిమానం ఉన్నా..చంద్రబాబు తిట్టమని చెప్పడం వల్లే సీఎంపై విమర్శలు చేశారని మండిపడ్డారు.
నానికి విజయవాడ ఎంపీ స్థానం కేటాయించినట్లు తెలిపారు. విజయవాడ ఎంపీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ తన ఖాతాలో వేసుకోబోతుందని పేర్కొన్నారు. పెనమలూరులో ప్రత్యర్థిగా పార్థసారథి అయినా, చంద్రబాబు అయినా తన పోటీ అక్కడి నుంచే ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment