
సాక్షి, నందిగామ: కృష్ణా జిల్లాలో ఓ నకిలీ స్వామిజీ గుట్టు రట్టయింది. పూజల పేరుతో అందరి జీవితాలను మార్చేస్తానని చెప్పి అమాయక మహిళలను ఆకర్షిస్తున్న బాబా.. వారి నుంచి భారీగా డబ్బు గుంజుతున్నాడు. బాబా మోసాలను గ్రహించిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం.. రామ శివ చైతన్యం తత్వపీఠం నిర్వహిస్తూ గత కొంతకాలంగా స్వామిజీగా చలామణి అవుతున్నాడు. తనకు మంత్రతంత్రాలు తెలుసునని ప్రచారం చేసుకున్నాడు. తన మాటలు నమ్మి వచ్చిన ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షల్లో స్వాహా చేశాడు.
ఈ క్రమంలో స్వామిజీని నమ్మి గద్దె పావని అనే మహిళ రూ. 2 లక్షల ను ముట్టుజెప్పింది. అయితే ఆయన అసలు రూపం గుర్తించిన సదరు మహిళ కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప్టటారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 30 లక్షల మేర వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. విచారణ చేపడుతున్న పోలీసులు నకిలీ బాబాను అదుపులోకి తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment