
మద్యం మత్తులో కారు నడిపి..
మద్యం మత్తులో కారు నడుపుతూ మోపెడ్‌పై వెళుతున్న వ్యక్తి మీదకు పోనివ్వడంతో అతడు నుజ్జునుజ్జయి మృతి చెందాడు.
నందిగామ (కృష్ణా జిల్లా) : మద్యం మత్తులో కారు నడుపుతూ మోపెడ్‌పై వెళుతున్న వ్యక్తి మీదకు పోనివ్వడంతో అతడు నుజ్జునుజ్జయి మృతి చెందాడు. కృష్ణా జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణ ప్రమాదం జరిగింది. చందర్లపాడు మండలం రామన్నపేటకు చెందిన భిక్షం (40) టీవీఎస్ మోపెడ్‌పై రామన్నపేట వైపు వెళుతున్నాడు. అదే మార్గంలో కొందరు వ్యక్తులు మద్యం సేవించి కారులో రామన్నపేట వైపు వెళుతున్నారు. మోపెడ్‌ను అధిగమించే ప్రయత్నంలో కారు అతడ్ని ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. కారు కింద భిక్షం నలిగిపోయి ప్రాణాలు విడిచాడు. ప్రమాదం అనంతరం కారులోనివారు పరారయ్యారు.