
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కాన్హా శాంతివనంలో రామచంద్ర మిషన్ గురూజీ కమ్లేష్ డీ పాటిల్ జన్మదినం సందర్భంగా శనివారం హరితహారం నిర్వహించారు. ఆశ్రమంలో కమ్లేష్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మొక్కలు నాటారు. శాంతివనం నర్సరీ నిర్వాహకులు శరవణన్ మాట్లాడుతూ.. గురూజీ జన్మదినం సందర్భంగా శనివారం దేశవ్యాప్తంగా 64 నగరాల్లో 64 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment