నందిగామ: భారీగా కమ్ముకున్న పొగమంచు కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం ఉదయం నుంచి దట్టమైన మంచు కురుస్తుండటంతో నందిగామ, దొనబండ, జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 కిలోమీటర్ల మేర మంచు కమ్ముకుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెడ్‌లైట్లు వేసుకున్నా వాహనం అతి సమీపంలోకి వచ్చే వరకు కనిపించక పోవటంతో తక్కువ వేగంతో నడుపుతున్నారు. కొన్ని చోట్ల వాహనాలను నిలిపి వేసుకున్నారు.