ధ్యాన శిబిరంలో మాట్లాడుతున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆందోళనలు, అనిశ్చితి, అభద్రతాభావం, శత్రుత్వా లతో నిండిన ప్రపంచంలో రామ చంద్ర మిషన్ వంటి సంస్థల బాధ్య తలు చాలా రెట్లు పెరిగాయని రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. కాన్హా శాంతివనం సంపూర్ణ జీవనానికి నమూనా వంటిదని ప్రశంసించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఈ ధ్యాన కేంద్రం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి గొప్ప ప్రదేశమని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో విస్తరించిన ఈ మిషన్ బలమైన ఆధ్యాత్మిక శక్తిగా మారిందని చెప్పారు. రామచంద్ర మిషన్ వ్యక్తిగత, సామాజిక మార్పును ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాజయోగ ధ్యానా నికి గల ప్రాచీన సంప్ర దాయాన్ని ఆధునిక ప్రపంచంలో మిషన్ ప్రోత్సహిస్తోందన్నారు. భారత ఆధ్యాత్మికత ప్రపంచానికి అత్యంత విలువైన బహుమతి వంటిదన్నారు.
నంది గామ మండలంలోని కాన్హా శాంతివనాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం సందర్శించారు. వనం గ్లోబల్ హెడ్‌క్వార్టర్‌ని రాష్ట్రపతి ప్రారంభించారు. మిషన్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసు కున్న సందర్భంగా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ఇక్కడ నిర్మించారు. ఇక్కడ నిర్వాహకులు 5 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా చివరి మొక్కను రాష్ట్ర పతి నాటి కేంద్రాన్ని పరిశీలించారు. అనంత రం అభ్యాసీలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలు, రైతులు, చేతి వృత్తిదారులు, ప్రయోజనాలకు చేపట్టిన కార్యకలాపాలు, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణకు తీసు కుంటున్న చర్యలు ప్రశంసనీయమని, 5 లక్షల మొక్కలతో ఈ క్యాంపస్ ఆకు పచ్చని పరిసరాలతో అలరారుతోందన్నారు.
సమున్నతులుగా తీర్చిదిద్దడానికి..
తమను తాము సమున్నతులుగా తీర్చిదిద్దు కోవాలన్న వారి కోరికను ఈ మిషన్ నెరవే ర్చుతుందని రాష్ట్రపతి తెలిపారు. మిషన్‌కు చెందిన అంతర్జాతీయ సమాజం భూమండ లాన్ని మెరుగైన ప్రాంతంగా తీర్చిదిద్దగలదని ఆకాంక్షించారు. సంతోషం, సంపూర్ణ సాను కూల శక్తియుక్తులతో అలరారే దిశగా మాన వాళిని పరివర్తన చెందించగలదన్న విశ్వా సాన్ని వెలిబుచ్చారు. ‘దాజీ వివరించిన ‘డిజై నింగ్ డెస్టినీ’లోని 5 సూత్రాలలో ఒకదాన్ని ఇక్కడ తప్పక నేను ప్రస్తావించాలి. మాన వత్వ గమ్యాన్ని రూపొందించాలి. ఇది మొదటగా మనతోనే ప్రారంభంకావాలి. ఆ తర్వాత ఇతరులకు విస్తరించాలి. అందరం కలిసి పనిచేస్తే మానవత్వ దిశను మార్చేం దుకు ఒకరోజు కచ్చితంగా వస్తుంది. ఇందుకు యువత సహకారం తీసుకుని మెరుగైన ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నాల్లో వారిని నిమగ్నం చేయాలి’అని పిలుపు నిచ్చారు.
శాంతివనం.. ఓర్పుకు నిదర్శనం
కాన్హా శాంతివనం మానవ ఓర్పుకు నిదర్శ నమని గురూజీ కమ్లేష్ డీ పటేల్(దాజీ) అన్నారు. ఐదేళ్లలో శాంతివనంలో ప్రపంచం లోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం నిర్మించడం వేలాది మంది అభ్యాసీకుల నిరంతర కృషి తోనే సాధ్యపడిందన్నారు. 1,400 ఎకరాల్లో శాంతి వనంలో నిర్మించిన ఐకానిక్ ధ్యాన కేంద్రం మానవాళి పరివర్తనకు కేంద్రంగా రూపాంతరం చెందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 75 వసంతాలు పూర్తి చేసు కున్న సందర్భంగా ధ్యాన శిబిరాలను గత నెల 28 నుంచి ఈ నెల 9 వరకు 3 విడతలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లు తమిళిసై, బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రపతికి ఘన వీడ్కోలు..
హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి కోవింద్‌కు బేగంపేట విమానాశ్రయంలో గవ ర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఘనంగా వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment