మెదక్లో టిఆర్ఎస్ విజయం లాంఛనమే!
హైదరాబాద్: తెలంగాణలో మెదక్ లోక్సభ స్థానానికి, ఏపిలో కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ స్థానానికి పోలింగ్ పూర్తి అయింది. పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ఉప ఎన్నికలలో పోలింగ్ శాతం బాగా తగ్గింది. మెదక్లో 66 శాతం పోల్ కాగా, నందిగామలో 66.6 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ నెల 16న ఓట్లను లెక్కిస్తారు.
మెదక్లో టిఆర్ఎస్ విజయం లాంఛనమేనని విశ్లేషకులు అంటున్నారు. అయితే టిఆర్ఎస్కు మెజార్టీ శాతం తగ్గే అవకాశం ఉంది. రెండు లక్షల మెజార్టీ వచ్చే అవకాశం లేదని అంటున్నారు. రెండవ స్థానం తమదంటే తమదని కాంగ్రెస్, బిజెపి వారు అంటున్నారు. సంగారెడ్డి, పఠాన్చెరు నియోజకవర్గాలలో మాత్రమే బిజెపి ప్రభావం ఉందని అంటున్నారు.
**