![Extramarital Affair: Two Arrested In Murder Case In NTR District - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/10/6969.jpg.webp?itok=bRrreZgC)
ప్రతీకాత్మక చిత్రం
నందిగామ(ఎన్టీఆర్ జిల్లా): హత్య కేసును నందిగామ పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన శివకుమార్ అనే తాపీ మేస్త్రి ఈ నెల 5వ తేదీ రాత్రి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై మృతుడి భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో మొత్తం నలుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించడమే కాకుండా ఇరువురు ప్రధాన నిందితులను అరెస్టు చేసి సోమవారం విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు.
ఏసీపీ నాగేశ్వరరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన వేముల అంకమ్మరావు, ఉప్పుతోళ్ల గోవర్దనరావును అరెస్టు చేశారు. మరో ఇరువురు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఏసీపీ తెలిపారు. కాగా ఫిర్యాదిదారైన మృతుని భార్యకు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, భర్తను అడ్డు తొలగిస్తే కలసి జీవించవచ్చనే దురుద్దేశంతోనే ఈ హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ హెచ్ ఓ కనకారావు, ఎస్‌ఐ సురేష్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment