వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం టీడీపీ నేత, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కలిశారు. నందిగామ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిని నిలబెట్టవద్దని ఆయన ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కోరారు. అయితే ఈ అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైఎస్ జగన్ తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఎన్నికల కమిషన్ ఆ స్థానానికి నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున తంగిరాల సౌమ్య పోటీ చేయనున్నారు. ఆమెను అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం ఎంపిక చేశారు.
Published Fri, Aug 22 2014 10:26 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
Advertisement