
సాక్షి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలో జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు ఎక్కువగా ఉండటంతో వరుసగా పదహారు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. కాగా ఈ ఘటనతో ట్రాఫిక్‌కు భారీగా అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు పాత జాతీయ రహదారి నుంచి వాహనాలను మళ్లిస్తున్నారు.