సాక్షి, నందిగామ: కోవిడ్–19 (కరోనా వైరస్) దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ కొనుగోళ్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో కొందరు వ్యాపారులు వారి ఆలోచనలకు పదునుపెట్టి ఆఫర్లు గుప్పిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఇదే తరహాలో కృష్ణాజిల్లా నందిగామ పట్టణంలోని పాతబస్టాండ్ ప్రాంతానికి చెందిన ఓ మాంసం వ్యాపారి ‘5 కేజీల మటన్ కొన్న వారికి హెల్మెట్ ఉచితం’ అంటూ ఆదివారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించాడు. దీంతో అతని వద్ద విక్రయాలు జోరుగా సాగాయి. (చదవండి: ఉచితంగా 2 వేల ఐఫోన్ల పంపిణీ!)
కాగా, కోవిడ్–19కు చికెన్‌కు సంబంధం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చికెన్, గుడ్లతో ఈ వైరస్ సోకుతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పౌల్ట్రీ ఫెడరేషన్ ఖండించింది. చికన్, గుడ్లు కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందదని తెలిపింది. (చదవండి: ‘కోవిడ్’.. చికెన్‌తో నో డేంజర్!)
Comments
Please login to add a commentAdd a comment