పూజిత మృతిపై అనుమానాలెన్నో.. | vasireddy pujitha death mystery | Sakshi
Sakshi News home page

పూజిత మృతిపై అనుమానాలెన్నో..

Published Mon, Mar 23 2015 7:54 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

పూజిత మృతిపై అనుమానాలెన్నో..

పూజిత మృతిపై అనుమానాలెన్నో..

కృష్ణా జిల్లా నందిగామకు చెందిన యువతి వాసిరెడ్డి పూజిత హైదరాబాదులో మృతి చెందిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామకు చెందిన యువతి వాసిరెడ్డి పూజిత హైదరాబాదులో మృతి చెందిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత పూజిత మృతి సమాచారం తెలియగానే ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చి న కథనాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కుటుంబసభ్యు లు, ఆమె తండ్రి శ్రీనివాసరావు ఆ తర్వాతి పరిణామాలను బట్టి ఈ ఘటన వెనుక ఏదో కుట్ర దాగి వుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పూజిత స్నేహితుడుగా చెబుతున్న అక్షయ్, బీహార్ రాష్ట్రంలోని పోలీసు అధికారి కుమారుడు కావ డం పలు అనుమానాల కు తావి స్తోందని వారు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశంలో కిరోసి న్ పోసుకుని నిప్పం టించుకుని ఆత్మహత్యకు పాల్పడుతుంటే ఎవరూ గమనించకపోవటమేమిటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూజిత శరీరం పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి శరీరం ఆ స్థాయిలో తగులబడుతుందా అనేది మరో అనుమానంగా ఉంది.

కేసును పక్కదోవ పట్టించేందుకు యత్నాలు!
అక్షయ్ పేరు వెలుగులోకి రాగానే అతని తండ్రి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు పూజిత కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.నందిగామపోలీసులకు కూ డా ఉన్నతాధికారుల వద్ద నుంచి ఈ కేసుపై ఎక్కువ ఆసక్తి చూపవద్దని ఆదేశాలందాయని వినికిడి. 

కుట్ర ప్రకారమే హత్య చేశారనే అనుమానాలు నెలకొన్నాయి. పోలీసుల విచారణలో అక్షయ్ చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవని మృతురాలి బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు వెలికితీయాలని వారు కోరుతున్నారు. ఇదిలావుండగా హైదరాబాద్‌లో ఆదివారం పూజిత అంత్యక్రియలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement