
వాలీబాల్ విజేత ఎస్‌డీఎం సిద్ధార్థ జట్టు
నందిగామ రూరల్ : కృష్ణా విశ్వ విద్యాలయం అంతర కళాశాలల మహిâýæల వాలీబాల్ పోటీల విజేతగా విజయవాడకు చెందిన ఎస్‌డీఎం సిద్ధార్థ కళాశాల జట్టు నిలిచింది. స్థానిక కాకాని వెంకటరత్నం కళాశాలలో నిర్వహించిన పోటీలు బుధవారం ముగిశాయి. ఆంధ్ర లయోల కళాశాల ద్వితీయ స్థానం, కేబీఎ¯ŒS కళాశాల తృతీయ స్థానం, వికాస్ వ్యాయామ విద్య కళాశాల నాల్గవ స్థానం సాధించాయి. విజేతలకు కేవీఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గరిమిడి వీరభద్రరావు, యూనివర్సిటీ స్పోర్‌్ట్స బోర్డ్ డైరెక్టర్ నల్లూరి శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాగం వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ కార్యదర్శి వాసిరెడ్డి నాగేశ్వరరావు, ఎంపిక కమిటీ సభ్యులు వై.ఉదయభాస్కర్, రామకృష్ణ, గేమ్స్ కమిటీ సభ్యులు స్వామి, సత్యప్రతిమ, రమేష్, ఏలూరు పిచ్చేశ్వరరావు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.