కృష్ణా: కృష్ణా జిల్లా నందిగామలో స్కార్పియో కేసు కలకలం రేపింది. ఆ కారు తిరుమలలో మిస్ అయినట్టు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదే విధంగా కారు రిజిస్ట్రేషన్ మాత్రం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో చేశారు. అంతే కాకుండా స్కార్పియోకు ముందు భాగంలో పోలీసు స్టిక్కర్లు, వెనుక భాగంలో ఆర్డీవో స్టిక్కర్లతో పలు మోసాలు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించడంతో నిందితులు స్కార్పియోను వదిలి పరారయ్యారు.