ఎలక్ట్రానిక్స్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం
Published Fri, Feb 17 2017 4:06 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
నందిగామ: కృష్ణాజిల్లా నందిగామలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉండే ఓ ఎలక్ట్రానిక్స్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం జరిగి ఉవ్వెత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. భాస్కర్ వాచ్ అండ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ కోసం నాలుగంతస్తుల భవనాన్ని గోడౌన్‌గా ఉపయోగిస్తున్నారు. ఇందులో టీవీలు, కూలర్లు, ఏసీలు పెద్ద మొత్తంలో స్టాక్ ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం షార్టు సర్క్యూట్‌తో గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.
ఫైరింజన్ వచ్చి మంటలు అదుపు చేసినా లాభం లేకపోవడంతో మరో ఫైరింజన్ కు సమాచారం ఇచ్చారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. మంటల్లో చిక్కుకున్న ఓ బాలికను బయటకు క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. 50 కూలర్లు, 100 వరకు ఎల్‌ఈడీ టీవీలు బూడిదయ్యాయి. గోడౌన్‌లో సుమారు రూ. కోటి విలువైన సరకు ఉన్నట్టు తెలుస్తోంది. భారీగా నష్టం సంభవించినట్లు సమాచారం.
Advertisement
Advertisement