electronics showroom
-
విజయవాడలో భారీ కుంభకోణం
సాక్షి, విజయవాడ: విజయవాడ బందరు రోడ్డులోని ఓ ఎలక్ట్రానిక్స్ షోరూంలో భారీ కుంభకోణం బయట పడింది. ఓ కంపెనీకి చెందిన టీవీ షోరూంలో ఉద్యోగులు భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. కోటి రూపాయల మేర మోసం చేశారని పోలీసులకు సంస్థ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. షోరూం మేనేజర్ సహా, సిబ్బందిపై కేసు నమోదు అయింది. ఈ మేరకు మేనేజర్, మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షోరూం, గోడౌన్‌లోని ఎల్ఈడీ టీవీలు, ఇతర ఉత్పత్తులు మాయం చేయడమేగాక వీటిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. -
ఎలక్ట్రానిక్స్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
నందిగామ: కృష్ణాజిల్లా నందిగామలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉండే ఓ ఎలక్ట్రానిక్స్ గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగి ఉవ్వెత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. భాస్కర్ వాచ్ అండ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ కోసం నాలుగంతస్తుల భవనాన్ని గోడౌన్‌గా ఉపయోగిస్తున్నారు. ఇందులో టీవీలు, కూలర్లు, ఏసీలు పెద్ద మొత్తంలో స్టాక్ ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం షార్టు సర్క్యూట్‌తో గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఫైరింజన్ వచ్చి మంటలు అదుపు చేసినా లాభం లేకపోవడంతో మరో ఫైరింజన్ కు సమాచారం ఇచ్చారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. మంటల్లో చిక్కుకున్న ఓ బాలికను బయటకు క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. 50 కూలర్లు, 100 వరకు ఎల్ఈడీ టీవీలు బూడిదయ్యాయి. గోడౌన్లో సుమారు రూ. కోటి విలువైన సరకు ఉన్నట్టు తెలుస్తోంది. భారీగా నష్టం సంభవించినట్లు సమాచారం.