విజయవాడలో భారీ కుంభకోణం | ​huge scam in electronic showroom in vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో భారీ కుంభకోణం

Published Tue, Oct 24 2017 2:29 PM | Last Updated on Tue, Oct 24 2017 2:29 PM

విజయవాడ బందరు రోడ్డులోని ఓ ఎలక్ట్రానిక్స్ షోరూంలో భారీ కుంభకోణం బయట పడింది.

సాక్షి, విజయవాడ: విజయవాడ బందరు రోడ్డులోని ఓ ఎలక్ట్రానిక్స్ షోరూంలో భారీ కుంభకోణం బయట పడింది. ఓ కంపెనీకి చెందిన టీవీ షోరూంలో ఉద్యోగులు భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. కోటి రూపాయల మేర మోసం చేశారని పోలీసులకు సంస్థ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. షోరూం మేనేజర్ సహా, సిబ్బందిపై కేసు నమోదు అయింది.

ఈ మేరకు మేనేజర్‌, మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షోరూం, గోడౌన్‌లోని ఎల్‌ఈడీ టీవీలు, ఇతర ఉత్పత్తులు మాయం చేయడమేగాక వీటిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement