కృష్ణా జిల్లాలో భూమి కంపించింది. నందిగామ సమీపంలో భూప్రకంపనలు సంభవించాయి.
నందిగామ: కృష్ణా జిల్లాలో భూమి కంపించింది. నందిగామ సమీపంలో భూప్రకంపనలు సంభవించాయి. రైతుపేట ప్రాంతంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించండంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురైయారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగుతీశారు. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం లేదు.
కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించే అవకాశముందని భూభౌతిక శాస్త్రవేత్తలు గతంలోనే తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ లో ఏర్పాటు చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ చుట్టుపక్కల భూప్రకంపనలు సంభవించడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.