నందిగామలో గన్ తో దుండగుడి బీభత్సం | unknown person shows Revolver, cash, gold Robbery in nandigama | Sakshi
Sakshi News home page

నందిగామలో గన్ తో దుండగుడి బీభత్సం

Published Mon, Apr 6 2015 11:17 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

నందిగామలో గన్ తో దుండగుడి బీభత్సం - Sakshi

నందిగామలో గన్ తో దుండగుడి బీభత్సం

నందిగామ : కృష్ణాజిల్లా నందిగామలో సోమవారం ఓ వ్యక్తి రివాల్వర్తో బెదిరించి కలకలం సృష్టించాడు.  ఓ వ్యాపారిని బెదిరించి అతని వద్ద నుంచి బంగారం దోచుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే కారులో (AP 31Q 3438) విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న సురేష్ కుమార్ అనే వ్యాపారిని సోమవారం ఉదయం ఓ వ్యక్తి గొల్లపూడి వద్ద లిప్ట్ అడిగాడు.

కోదాడలో దిగిపోతానని చెప్పటంతో లిప్ట్ ఇచ్చాడు. నందిగామ మండలం హనుమంతపాలెం సమీపంలో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీతో వ్యాపారిని బెదిరించి 3 బంగారపు ఉంగరాలు, గొలుసుతో పాటు నగదు దోచుకున్నాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ సెల్ఫోన్లో వ్యాపారి ఫోటో తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం పొలాల్లోకి పారిపోయినట్లు సమాచారం. ఈ సంఘటనతో భయభ్రాంతులకు గురైన వ్యాపారి నందిగామ డీఎస్పీ రాదేశ్ మురళికి ఫిర్యాదు చేశాడు.

కాగా బెదిరించి, దోపిడీకి పాల్పడిన వ్యక్తి...సిమీ కార్యకర్తగా పోలీసులు అనుమానిస్తున్నారు.  తాజా పరిణామాలతో నందిగామ-జగ్గయ్యపేట హైవేపై పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement