
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ: జిల్లాలోని నందిగామలో దొంగనోట్లు ముద్రిస్తున్నారనే వార్త కలకలం రేపింది. పాత బైపాస్ రోడ్డులో గల ఓ ఇంట్లో దొంగ నోట్లు ముద్రిస్తున్నారనే పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ఉదయం దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నోట్లు ముద్రించే సాధనంగా భావిస్తున్న ప్రింటర్ స్కానర్, మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటికి తాళం వేసి సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఎన్‌కేపాడులో..
విజయవాడ రూరల్ మండలంలోని ఎన్‌కేపాడులో దొంగనోట్లు ముద్రిస్తున్న షేక్ బాబు, షేక్ సుభాని, షేక్ జానీలను గురువారం ఉదయం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 75 వేల రూపాయలు విలువగల రూ. 100 నోట్లను, కంప్యూటర్, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment