సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ (55) హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. జయరామ్ మేనకోడలు శ్రిఖా చౌదరి, ఆమె ప్రియుడు రాకేష్‌లు కలిసి ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రిఖా చౌదరి, రాకేష్‌లు ఒకరినొకరు ప్రేమించుకున్నారని, వీరి వివాహానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని సమాచారం. తన మేనకోడలును వదిలేయమని రాకేష్‌ను జయరామ్ కోరారని, వదిలేయడానికి రూ.3.5కోట్ల ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.(వ్యాపారవేత్త జయరామ్ అనుమానాస్పద మృతి)
ఒప్పందం ప్రకారం షికాను రాకేష్ వదిలేశాడు. కానీ జయరామ్ డబ్బులు ఇవ్వలేదు. దీంతో మళ్లీ ఒక్కటైన శ్రిఖా, రాకేష్‌లు జయరామ్‌ను హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన రోజు జయరామ్ ఇంటికి శ్రిఖా వచ్చినట్లుగా తెలుస్తోంది. వాచ్‌మెన్‌ను బెదిరించి ఇంటితాళాలు తీసుకొని ఇంట్లోకి వెళ్లిందని పోలీసుల విచారణలో తేలింది. రాకేష్ సహాయంతోనే జయరామ్‌ను షికా హత్యచేసిందని పోలీసులు భావిస్తున్నారు. శ్రిఖా చౌదరి, జయరామ్ సోదరి, రాకేష్, ఇద్దరు కారుడ్రైవర్లతో పాటు గన్‌మెన్‌న్లను పోలీసులు విచారిస్తున్నారు.
కాగా, శుక్రవారం నాడు పోస్టు మార్టం నిర్వహించిన జయరామ్ మృతదేహాన్ని అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. విదేశాల్లో ఉన్న జయరామ్ భార్య, పిల్లలు ఆదివారం ఉయదం హైదరాబాద్‌కు వస్తారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. జయరామ్ భార్య, పిల్లలు వచ్చిన తర్వాతే అంత్యక్రియలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment